NLG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ఈ బంద్‌లో బడుగు బలహీనవర్గాల ప్రజలు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.