PDPL: ఓదెల మండలం గూడెం సబ్ స్టేషన్ పరిధిలోని గూడెం, ఇందుర్తి, గుంపుల, బాయమ్మపల్లి గ్రామాలకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్ తెలిపారు. సబ్ స్టేషన్ నెలవారీ మరమ్మతుల కారణంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.