BPT: మన కుటుంబ రక్షణ మన చేతుల్లోనే ఉందని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 181 ఉమెన్ హెల్ప్ లైన్, 100 పోలీస్, 108 అత్యవసర వైద్యం, 104 వైద్య సహాయం, 15100 జాతీయ న్యాయ సహాయం, 112 జాతీయ అత్యవసర సేవ, 1930 సైబర్ నేరాలు, 101 ఫైర్ ఈ నెంబర్లకు సంప్రదించాలని కోరారు.