ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు టూరిజం షాక్ నుంచి నోటీసులు అందాయి. ఆయనకు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మోర్టిమ్లోని తన విల్లాను గెస్లులకు అద్దెకు ఇవ్వనున్నట్టు ఆయన ఆన్లైన్లో ప్రకటన చేయడంపై నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం, గోవాలో హోమ్‌స్టే (పెయింగ్గెస్ట్) ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆ మేరకు అనుమతులు తీసుకోనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఉత్తర గోవాలోని మోర్జిమ్‌లోని ‘కాసా సింగ్’ పేరిట ఉన్నయువరాజ్ విల్లా చిరునామాకు పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్ కాలే పేరిట నవంబర్ 18న నోటీసు జారీ అయింది. డిసెంబర్ 8న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అందులో అధికారులు పేర్కొన్నారు.
పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని గోవా టూరిజం శాఖ స్పష్టం చేసింది.