TG: HYD ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. BRS చలో బస్‌భవన్ నేపథ్యంలో RTC క్రాస్ రోడ్ మార్గంలో పోలీసులు మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీమంత్రి KTR, హరీశ్ రావు, తలసాని, పద్మారావును మాత్రమే బస్ భవన్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో BRS కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురు BRS నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.