ATP: గుత్తి సుందరయ్య కాలనీకి చెందిన బీమా, శ్రీదేవి దంపతుల కుమారుడు అదృశ్యమయ్యాడు. సాయికుమార్ జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించినా లభించకపోవడంతో తల్లిదండ్రులు సాయికుమార్ కనిపించడం లేదని బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.