Seethakka Son Surya will Contest Pinapaka Assembly constituency
Seethakka Son Surya:ములుగు ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ సీతక్క (Seethakka) కుమారుడు సూర్య (Surya) రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. పినపాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. కుమారుడి టికెట్ కోసం సీతక్క (Seethakka) ప్రయత్నాలు చేస్తున్నారట. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సీతక్క మధ్య మంచి అనుబంధం ఉంది. ఏఐసీసీ స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా చనువు ఉంది. భారత్ జోడో పాదయాత్రలో అతనికి సీతక్క (Seethakka) షూ గిప్ట్ అందజేసిన సంగతి తెలిసిందే.
సీతక్క (Seethakka) సూచనల మేరకు సూర్య (Surya) పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ను కలుపుకుని.. ముందుకు సాగుతున్నారు. సూర్యతోపాటు (Surya) సీతక్క (Seethakka) ఇక్కడ పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీతక్క (Seethakka) ములుగు నుంచి బరిలోకి దిగుతారు. తన నియోజకవర్గంలో పట్టు ఉన్నందున.. పికపాకలో కుమారుడి కోసం సమయం కేటాయించారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పినపాక నుంచి సీతక్క (Seethakka) పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కుమారుడి కోసం పర్యటిస్తున్నారని ఆ తర్వాత తెలిసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నుంచి రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన కాంతారావుకు చెక్ పెట్టాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సీతక్క (Seethakka) ప్రతిపాదనకు రేవంత్ కూడా అంగీకరించినట్టు తెలిసింది. హై కమాండ్ను ఒప్పించి.. సూర్యను (Surya) బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.
సీతక్క (Seethakka), రేవంత్ (Revanth) వెర్షన్ ఇలా ఉండగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏమంటారో చూడాలీ. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు.. ఇప్పటివరకు ఏ నేత కూడా పోటీ చేస్తానని ప్రకటించలేదు. సీతక్క (Seethakka) అడుగులు వేయడంతో.. సీనియర్ నేత వచ్చినా రావొచ్చని పొలిటికల్ ఆనలిస్టులు చెబుతున్నారు.