VSP: మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీలతో విశాఖ కోలాహలం నెలకొంది. ఈ నెల 9 నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొత్తం అయిదు మ్యాచ్లు జరగనున్నాయి. 9న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనుంది. 12న జరిగే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ను వీక్షించేందుకు ఏసీఏ చక్కటి అవకాశం ప్రేక్షకులకు కల్పించింది. టికెట్ ధర రూ. 150గా నిర్ణయించింది.