KRNL: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు వారి ఆస్తి హక్కును కోల్పోతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి హెచ్చరించారు. జిల్లా హార్టికల్చర్ హాలులో మంగళవారం జరిగిన వృద్ధుల దినోత్సవంలో మాట్లాడుతూ.. వృద్ధులపై వేధింపులు, దాడులు పెరిగాయని అన్నారు. వయోవృద్ధుల పోషణ చట్టం (2007) ప్రకారం వృద్ధులకు నెలవారీ జీవన భృతి కల్పించాలన్నారు.