NLR: విడవలూరు మండలం కంచరపాలెంలో కొర్రా వెంకయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన విడవలూరు ప్రసాద్ అనే వ్యక్తి మచ్చు కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎస్సై నరేశ్ కేసు నమోదు చేశారు.