ATP: అనంతపురం శిశుగృహంలో పసికందు మృతి ఘటనలో బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభియోగంపై ఐసీడీఎస్ పీడీ నాగమణిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ప్రత్యేక ఉత్తర్వు జారీ చేశారు.