KDP: వాల్మీకి మహర్షి జయంతిని ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మైదుకూరు రోడ్డులోని వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి రామాయణాన్ని అందించిన గొప్ప వ్యక్తి వాల్మీకి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి సంక్షేమ సంఘ డైరెక్టర్ నాగరాజు, ఆ సంఘ నాయకులు పాల్గొన్నారు.