KDP: ప్రొద్దుటూరులో ఇవాళ రూ.49.49 లక్షల CMRF చెక్కులను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో బాధితులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంతగా సీఎం సహాయ నిధి నుంచి సహాయం ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.