KMM: రాష్ట్రంలో పత్తి కోనుగోలు చేయడం గురించి భారత పత్తి సంస్ధ(సీసీఐ) అధికారులతో మరియు జిన్నింగ్ మిల్లుల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం చర్చలు జరిపారు. పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలని మంత్రి తెలిపారు. వారితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృధ్ధి సంస్ధ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.