TG: సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్, మీనాక్షి నటరాజన్ బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈనెల 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.