PDPL: ధర్మారం రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కోమటిరెడ్డి మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రగుంటపల్లిలో జరిగిన సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా సామ ఎల్లారెడ్డిని ఎన్నుకున్నారు. మిగిలిన కమిటీని త్వరలో ప్రకటిస్తామని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కల్లెం స్వామిరెడ్డి, తదితరులు ఉన్నారు.