ADB: భారత రాష్ట్ర సమితి బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని BRS నాయకుడు కేమ శ్రీకాంత్ అన్నారు. సోమవారం భీంపూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతమైన గొల్లగడ్ గ్రామంలో ఆయన పర్యటించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.