WGL: పర్వతగిరి (M) తురకల సోమారం గ్రామంలో రోడ్డు పక్కన పొలంలో నిలిపిన జెసీబీ నుంచి 400 లీటర్ల డీజిల్ చోరీ జరిగింది. బాధితుడు దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో పని కోసం జెసీబీని తీసుకెళ్లి, చీకటి పడటంతో 400 లీటర్ల డీజిల్ నింపి పక్కన పెట్టారు. ఉదయం చూసే సరికి ట్యాంక్ మూత తొలగించి డీజిల్ దొంగిలించారని వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.