SKLM: గార మండలం బలరాం పురం సముద్ర తీరంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఈ సంఘటన చోటుచేసుకుందని మత్స్యకారులు తెలిపారు. దీంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నదులు, చెరువులు, కాలువల ద్వారా వచ్చిన చెత్తా, చెదారం సముద్రంలో చేరడంతో ఈ పోగులు దర్శనమిస్తున్నాయి.