VZM: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.