SKLM: విశాఖపట్నం వెళ్లే క్రమంలో ఇచ్ఛాపురం రైలునిలయంలో ట్రైన్ ఎక్కుతున్న ఎం.త్రినాథ్ (55) ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందారు. తేలుకుంచికి చెందిన ఈయన విశాఖలో పనికోసం ఆదివారం బయలుదేరారు. రైలు ఎక్కేక్రమంలో జారిపడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతిని భార్య వరలక్ష్మి, కుమార్తె శారద విలపిస్తున్నారు. పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు.