NLR: ఈనెల 7న విజయవాడలో జరిగే FAPTO పోరు బాటను జయప్రదం చేయాలని UTF ఉదయగిరి మండల శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు. UTF నేతలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని, బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. పెండింగ్ బకాయిలతో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని ఈ పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు.