AKP: కోటవురట్ల మండలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో సాగునీటి చెరువుల్లో నీరు పుష్కలంగా చేరింది. దీంతో తంగేడు, సుంకపూర్, లింగాపురం, పాములవాక తదితర చెరువులు సాగునీటితో కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు సాధారణ విస్తీర్ణానికి మించి వరిపంటను సాగు చేస్తున్నారు.