NZB: ఈనెల 10న జరిగే పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రావు ఆదివారం సాయంత్రం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను 2 భాగాలుగా విభజించేందుకు ఆర్థిక బిల్లులో భాగంగా తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్-2025ను రద్దు చేయాలని,పెన్షనర్లకు DA ఇతర ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేసే ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.