మావోయిస్టులకు కంచుకోట లాంటి ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో CRPF మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ను ఉద్ధృతం చేసింది. ఇప్పటికే బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన CRPF.. తాజాగా స్థానిక ఆదివాసీలకు ప్రధాని ‘మన్ కీ బాత్’ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు 10800 రేడియోలను పంపిణీ చేసింది.