విజయనగరం ఉత్సవాల్లో భాగంగా కోట ఎదురుగా బొంకులదిబ్బ వద్ద ఆదివారం రాత్రి ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. మహాకవి గురజాడ అప్పారావు రాసిన ఈ విశ్వ విఖ్యాత నాటకం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్నట్టుగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. వేదిక ఇంఛార్జ్, గనుల శాఖ ఉప సంచాలకులు సీహెచ్ సూర్య చంద్రరావు పర్యవేక్షించారు.