VSP: ఇండియన్ నేవీలోకి సోమవారం మరో యుద్ధనౌక చేరబోతుంది. కోల్కతాలో నిర్మించిన ఐఎన్ఎస్ ఆండ్రోత్ యుద్ధనౌకను నేవి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందక్కర్ సోమవారం కమిషనింగ్ చేయనున్నారు. సముద్ర జలాల్లో ఉన్న శత్రుదేశ సబ్మెరైన్లను గుర్తించి నాశనం చేయగల సత్తా ఈ నౌకకు ఉంది. ఈ నౌక చేరికతో తూర్పు నౌకదళం భద్రతాపరంగా మరింత పటిష్టపడుతుందని నేవీ వర్గాలు తెలిపారు.