NLR: కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం ఫీడర్ లైన్లో మరమ్మత్తుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నరసింహ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంకటాద్రిపాలెం, దూబగుంట, బిలాల్ నగర్, తదితర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు సప్లై ఉండదన్నారు.