AP: కర్నూల్ జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. దసరాకు ముందు రూ.8-10 పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు రూ.4కి పడిపోయింది. ఇందులో తమ చేతికి వచ్చేది రూ.1 మాత్రమేనని రైతులు వాపోతున్నారు. కష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాట ధర లేకపోవడంతో అనంతపురం ప్రధాన రహదారిపై పారబోసి ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.