VSP: కేంద్రమంత్రి, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావాల్ ఆదివారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. సోమవారం విశాఖ పోర్టులో భారీ క్యారియర్ నౌక చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి స్వాగతం పలకనున్నారు. సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు.