సంగారెడ్డిలోని ఎంఎస్ అకాడమీలో ఈనెల 7న అండర్-19 బాలికల ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి గణపతి ఆదివారం తెలిపారు. పదవ తరగతి మెమో, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలని చెప్పారు. పూర్తి వివరాలకు 81068 41226 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.