KNR: చిగురుమామిడి మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పీచుపల్లిలో కురిసిన వర్షం వల్ల వరి పంట నేలకొరిగింది. దీనివల్ల వరి గొలుసుకట్టు సగం నల్లబడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంట అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.