KRNL: అధిక వర్షాల వల్ల పత్తి, వేరుశనగ, టమాటా, ఉల్లి పంటల నష్టానికి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం కోసిగిలో పత్తి పంటను పరిశీలించి, కుళ్లు, తెగలు, తగ్గిన దిగుబడి వల్ల రైతుల పెట్టుబడి తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలన్నారు.