NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు ఇన్ ఫ్లో వస్తుందని అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టుకు 15500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రావడంతో అధికారులు మూడు గేట్లు ఎత్తివేసి 22581 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటీ మట్టం 358.70 మీ.. ఉందని అన్నారు.