భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. అయితే బొప్పాయిని ఉదయం ఖాళీ కడుపుతో తినవద్దు. అలాగే అలర్జీ ఉన్నవారు కూడా దూరంగా ఉండాలి.