కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార 1’ రూ.200 కోట్ల క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.232 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.