SRPT: నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో కొత్త బైక్ కొనివ్వలేదనే మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు దసరా పండగ సందర్భంగా బైక్ కొనివ్వడానికి నిరాకరించడంతో గణేష్ అనే విద్యార్థి ఈనెల 3వ తేదీన రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు.