నటుడు సుహాస్ నటిస్తున్న ‘మండాడి’ మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగింది. సముద్ర ప్రాంతాల్లో కీలక సీన్స్ తెరకెక్కిస్తుండగా.. సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో రూ. కోటి విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోగా.. వారిని కాపాడారు. రామనాథ పురం జిల్లా తొండి సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.