NLG: దివంగత నేత జీ. వెంకటస్వామి (కాకా) జయంతిని పురస్కరించుకుని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం కాకా చేసిన కృషి ఎంతో గొప్పది అని కొనియాడారు.