MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, చిన్న రేవల్లి, పెద్ద రేవల్లి, తిరుమలగిరి, గౌతాపూర్, నందారం, ఉడిత్యాల, బోడ జానంపేట తదితర గ్రామాలలో ఆదివారం ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద రేపల్లెలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా.. 44వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాయి.