NLG: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, ఓటర్ల జాబితాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.