మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ వెంకటాద్రి నగర్ కాలనీలో గత తొమ్మిది రోజులుగా దేవీ నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న అమ్మవారు శనివారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన యువకులు మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.