Vsp: ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ ఆశించిన ప్రగతి సాధించిందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. సరకు రవాణాతో పాటు ప్రయాణికుల పరంగా గతంలో కంటే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందన్నారు. ముఖ్యంగా ఇనుప ఖనిజం రవాణాతో దేశ అభివృద్ధిలో కీలకంగా మారిందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.