పిల్లల్లో సమస్యలను పరిష్కరించాలనే కుతూహలం సహజంగానే ఉంటుంది. వారిలో ఉండే ఉత్సుకత, సృజనాత్మక శక్తి వల్ల ప్రతి విషయాన్ని తమంత తాముగా పరిశోధించాలన్న ఆసక్తి చూపిస్తారు. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతి చిన్న పనినీ మీరే చేసిపెట్టకుండా, వారు చేసే ప్రయత్నాలను ప్రోత్సహించండి. వాటిని అల్లరిలా భావించి విసుక్కోవడం సరికాదు.