Vsp: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర సూచించారు. శనివారం సాయంత్రం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో,ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. అరకు, అనంతగిరి హైడ్రో ప్రాజెక్టు వల్ల ఏజెన్సీ ముంపుకు గురవుతుందని జడ్పీటీసీ గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు.