NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్లో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆమె శనివారం సాయంత్రం బోయిన్ పల్లీ ప్రాంతంలో జరిగిన దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు.