VSP: విశాఖ బీచ్‌రోడ్డులోని తూర్పు నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ కళింగలో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ గార్డు (సెంట్రీ)గా విధులు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన బాజి బాబా షాహిక్ (44) రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం విధుల్లో ఉన్న సమయంలో ఆయన తన కంఠం వద్ద రైఫిల్ పెట్టుకుని కాల్చుకున్నారు.