E.G: స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన నల్లజర్లలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఈ మేళాకు అనేక కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు.