MDK: పాపన్నపేటలో శనివారం ఓ చెక్డ్యామ్లోని ప్రవాహంలో ఇద్దరు యువకులు చిక్కుకుని ప్రమాదంలో ఉన్నారు. స్థానిక పోలీస్లు, అగ్నిమాపక సిబ్బంది తాడును ఉపయోగించి సాహసోపేతంగా వారిని రక్షించారు. ఈ సాహసోపేతమైన రక్షణపై స్థానికులు వారి సేవలను అభినందించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈ ఘటనపై మాట్లాడుతూ.. నీటి ప్రవాహాల వద్ద జాగ్రత్తలు తప్పక పాటించాలన్నారు.