NGKL: భారతీయ జనతా పార్టీ ద్వారానే అందరికీ సంక్షేమ లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.